
గర్భధారణ సమయాల్లో మహిళలు వివిధ స్థాయిల్లో అసౌకర్యం మరియు నొప్పిని అనుభవిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పులు మరింత విపరీతంగా ఉంటాయి. ఈ నొప్పులు సాధారణంగా గర్భం యొక్క రెండు మరియు మూడో త్రైమాసికాల్లో వెనుక కాళ్లు, పాదాలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఈ అసౌకర్యం వలన సరిగ్గా నిద్రలేకపోవడం, తిరగడంలో ఇబ్బంది మొదలయినవి కలుగుతాయి. మీ శిశువుల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయని.. మీరు ఎటువంటి ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ ఉపయోగించకూడదని అనుకుంటే ఎప్సమ్ సాల్ట్ స్నానం చేయవచ్చు.
ఎప్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ యొక్క స్పటికీకరించబడిన రూపం. దీనిని వివిధ రకాల వ్యాధుల నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. గర్భధారణ సమయంలో దీనిని ఉపయోగించడం సురక్షితం. ఇది స్వచ్ఛమైన ఖనిజం. దీనిని బాత్‌టబ్ ఉప్పుగా వినియోగించవచ్చు. ఇది చాలా రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ఎప్సమ్ ఉప్పు మెగ్నీషియం యొక్క స్పటికీకరణ రూపం కాబట్టి అది మన శరీరంలోని కణజాలాన్ని రిపేర్ చేయడంలో మరియు మన శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం గర్భాశయానికి కలిగే చిరాకుకు చికిత్స చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. మెగ్నీషియాన్ని ఘనరూపంలో తీసుకునే బదులు చర్మం ద్వారా సంగ్రహించినట్లయితే మంచి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఒక సాధారణ బాత్‌టబ్‌లో 2 కప్పుల ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. వారానికి రెండు సార్లు 12 నిమిషాల పాటు దీనిలో స్నానం చేస్తే సరిపోతుంది.
మెగ్నీషియం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం వాపు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో మీ చర్మం, ఎముకలు, కండరాలు సాగి మీ బిడ్డ ఎదిగేందుకు ఖాళీ ప్రదేశాన్ని కల్పిస్తాయి. ఇది శరీరంలో నొప్పిని మరియు వాపును కలిగిస్తుంది. ఎప్సమ్ ఉప్పు స్నానం చేయడం వలన మీ కండరాలు విశ్రాంతి పొందుతాయి. శరీరంలోని అన్ని వాపులు తగ్గిపోతాయి.
ఒత్తిడితో ఉన్న రోజులో వెచ్చని నీటితో స్నానం చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది. ఎప్సమ్ ఉప్పును జోడించడం వలన ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. మెగ్నీషియం వలన మన శరీరం సెరెటోనిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంది. ఇది మన శరీర పోరాటపటిమ స్థాయిలను తగ్గిస్తుంది. ఆందోళన కారణంగా సెరెటోనిన్ తక్కువ స్థాయిలను మీరు అనుభవించవచ్చు. మీ శరీరంలో సెరెటోనిన్ స్థాయిలను నియంత్రిస్తుంది మరియు మీ శరీరాన్ని రిలాక్స్ చేసేందకు ఎప్సమ్ ఉప్పు ఉపయోగపడుతుంది.
మీ చర్మం సాగడం (స్ట్రెచ్) ప్రారంభించనప్పుడు మీకు చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ మీ చర్మం విశ్రాంతి తీసుకునేందుకు ఉపశమనం అందిస్తుంది. ఇది మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ప్రస్తుతం అనేక బాడీ స్క్రబ్, ఫేస్ స్క్రబ్‌లలో ఇది ఉంటుంది.
గర్భధారణ సమయంలో మలబద్దకం ఎక్కువగా ఉంటుంది. గర్భాశయంపై శిశువు ఒత్తిడి కారణమైనపుడు హెమోరాయిడ్స్ ఉత్పత్తికి కారణం అవుతుంది. హెమోరాయిడ్స్ పాయువు చుట్టూ ఉన్న సిరలు ఉబ్బేందుకు కారణం అవుతాయి. ఎప్సమ్ సాల్ట్ స్నానం అనేది హెమోరాయిడ్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. వేడి నీటితో స్నానం నరాలను శాంతపరుస్తుంది. ఎప్సమ్ ఉప్పు స్నానంలో ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
ఎప్సమ్ సాల్ట్ బాత్స్ గర్భిణీ స్త్రీలకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మీ శరీరంలోని నొప్పిని, వాపును, ఒత్తిడిని తగ్గిస్తాయి. వారానికి రెండు సార్లు 12-15 నిమిషాల పాటు ఎప్సమ్ స్నానం చేయడం వలన మీరు మీ బిడ్డ ఆరోగ్యంతో పాటుగా మీ శరీరానికి కూడా జాగ్రత్తగా ఉంచుకోగలుగుతారు.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |